హైదరాబాద్: జేఎన్టీయూ యూనివర్శిటీ పరిధిలోని విద్యాసంస్థల్లో రేపటి నుండి , ఉస్మానియా  యూనివర్శిటీ పరిధిలో ఎల్లుండి నుండి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

డిగ్రీ, పీజీ సెమిస్టర్, చివరి పరీక్షల నిర్వహణపై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.పరీక్షలు ఎలా నిర్వహించాలనేది ప్రభుత్వ నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

also read:ప్రభుత్వ విధానం గందరగోళం:డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టు

పరీక్షలను కరోనా జాగ్రత్తలతో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.ఎప్పటిలాగే రాతపరీక్ష ద్వారా చివరి సెమిస్టర్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అటానమస్ కాలేజీలు వారికి అనుకూలంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారిని కూడ రెగ్యులర్ పాస్ గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 

సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని పిటిషనర్ల తరపు లాయర్ దామోదర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ నిర్ణయమమేనని అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. రెండు నెలల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జేఎన్‌టీయూ ప్రకటించింది.