హైదరాబాద్: ఢిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహించడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై  సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 

చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని  ఎన్ఎస్ యూఐతో ఇతరులు  పిటిషన్లు దాఖలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు ,ఇంటర్నెట్ సమస్య  కారణంగా ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వ తరపు లాయర్.

పరీక్షలు రాయలేని విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. సప్లిమెంటరీ లో ఉత్తీర్ణులైనప్పటికీ రెగ్యులర్ గా పరిగణిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అటానమస్ కాలేజీలకు మాత్రం ఆన్ లైన్ లో నిర్వహించేందుకు స్వేచ్ఛ ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. 

క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామని  ఓయూ ప్రకటించింది.మిడ్ టర్మ్ పరీక్షలు ఆన్ లైన్ లో.. సెమిస్టర్ ఆఫ్ లైన్ లో నిర్వహిస్తామన్న జే ఎన్ టీయూ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విధానం గందరగోళంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. 

ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ఎదో ఒకే విధానం ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది.ఈ విషయమై రేపటిలోపుగా స్పష్టత ఇవ్వాలని  హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.