Asianet News TeluguAsianet News Telugu

ఒక్క రోజుకే రూ.1.50 లక్షల బిల్లు: ఫీవర్ ఆసుపత్రి డీఎంఓ నిర్భంధం,సెల్ఫీ వీడియో

నగరంలోని చాదర్ ఘాట్ వద్ద ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా రోగికి ఒక్క రోజుకే రూ. 1.50 లక్షలు బిల్లు వేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన వ్యక్తిని ఆసుపత్రి సిబ్బంది నిర్భంధించింది. 

fever hospital dmo sultana gets Rs. 1.50 lakhs for corona treatment
Author
Hyderabad, First Published Jul 5, 2020, 11:31 AM IST


హైదరాబాద్: నగరంలోని చాదర్ ఘాట్ వద్ద ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా రోగికి ఒక్క రోజుకే రూ. 1.50 లక్షలు బిల్లు వేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన వ్యక్తిని ఆసుపత్రి సిబ్బంది నిర్భంధించింది. 

హైద్రాబాద్ చాదర్‌ఘాట్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫీవర్ ఆసుపత్రిలో డీఎంఓ పనిచేసే సుల్తానా కరోనా చికిత్స కోసం చేరారు.24 గంటలకు కరోనా చికిత్స కోసం సుల్తానాకు రూ. 1.50 లక్షల బిల్లును ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చింది. ఈ బిల్లును చూసి షాక్ తిన్న డాక్టర్ సుల్తానా  ఈ విషయమై ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించింది.

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన దాని కంటే ఎక్కువగా చార్జీ చేశారని ఆమె ప్రశ్నించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది తనను నిర్భంధించినట్టుగా డాక్టర్ సుల్తాన్ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు.

డబ్బుల గురించి ప్రశ్నించినందుకు తమకు సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడం లేదని ఆమె ఆ వీడియోలో తెలిపారు. కన్నీరు పెట్టుకొంటూ ఆమె ఆ వీడియోలో తన బాధను చెప్పుకొన్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. 

కరోనా రోగులకు అందించే చికిత్సల కోసం ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు ఫీజులను నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ఫీజులను పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios