మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు: షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

  మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. కిడ్నాప్, రేప్ కేసుల్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు 
 
Telangana High Court Grants  Bail To Former Marredpally CI Nageswara Rao

హైదరాబాద్: సస్పెన్షన్ కు గురైన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కిడ్నాప్, రేప్ కేసుల్లో మాజీ సీఐ నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్  చేసిన విషయం తెలిసిందే.   గతంలో రెండు దఫాలు నాగేశ్వరరావు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అయితే ఇవాళ మాత్రం షరతులతో నాగేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

ఈ ఏడాది జూలై 7వ తేదీన హైద్రాబాద్ నగరంలోని హస్తినాపురంలోని వివాహిత ఇంటికి వెళ్లి  నాగేశ్వరరావు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రివాల్వర్ కణతకు పెట్టి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తపై కూడా ఆయన దాడికి దిగాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిద్దరిని తన వ్యవసాయ పొలానికి తీసుకువెళ్తున్న సమయంలో ఇబ్రహీంపట్నం సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి తప్పించుకున్న బాధితురాలు ఆమె భర్త వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 నాగేశ్వరరావుపై కేసు నమోదు కావడంతో ఆయనపై సస్పెన్షన్ ను విధిస్తూ హైద్రాబాద్ సీపీ  ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో కూడా కీలక విషయాలను పోలీసులు ప్రకరటించారు. బాధితురాలి భర్త ఇంట్లో ఉన్నాడా అనే విషయాన్ని తెలుసుకొనేందుకు మొబైల్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి భర్త ఇంట్లో లేని విషయాన్ని గుర్తించి  ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

also read:ముగిసిన పోలీస్ కస్టడీ: హయత్ నగర్ కోర్టుకు సస్పెన్షన్ గురైన సీఐ నాగేశ్వరరావు
ఈ కేసులో అరెస్టైన నాగేశ్వరరావు  బెయిల్ కోసం ప్రయత్నించారు. రెండు దఫాలు ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయినా కూడా ఆయన బెయిల్ పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. ఇవాళ మాత్రం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయాల పూచీకత్తు ఇవ్వాలని కూడా ఆదేశించింది. నాగేశ్వరరావుకు అధికారపార్టీకి చెందిన కీలక నేతలతో సంబంధాలున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలోనే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios