Asianet News TeluguAsianet News Telugu

రేప్ కేసులో ట్రైనీఐఏఎస్ కి 15 రోజుల ముందస్తు బెయిల్.. నపుంసకత్వ పరీక్షకు ఆదేశించిన హైకోర్టు..

మృగేందర్ లాల్ దర్యాప్తుకు సహకరించాలని, నపుంసకత్వ పరీక్షకు వెళ్లాలని, లేకపోతే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతు దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేయొచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణను డిసెంబర్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. మృగేందర్ లాల్ 2019 డిసెంబర్ 25న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

telangana high court grant 15 days interim bail for trainee ias officer in molested case
Author
Hyderabad, First Published Nov 26, 2021, 11:55 AM IST

హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐఏఎస్ బి. మృగేందర్ లాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 27 నుంచి జనవరి 16 వరకు IAS trainingకి వెళ్లాల్సి ఉన్నందున హైకోర్టు 15 రోజుల తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

అంతేకాదు, Mrugender Lal Banoth దర్యాప్తుకు సహకరించాలని, నపుంసకత్వ పరీక్షకు వెళ్లాలని, లేకపోతే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతు దర్యాప్తు అధికారి పిటిషన్ దాఖలు చేయొచ్చని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విచారణను డిసెంబర్ 9కి హైకోర్టు వాయిదా వేసింది. మృగేందర్ లాల్ 2019 డిసెంబర్ 25న తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు కూకట్ పల్లి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పిఎ)లో మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై అభియోగాలు మోపబడిన ఐఎఎస్ ట్రైనీ మృగేందర్ లాల్ బానోత్ Advance Bail Petition‌ను తెలంగాణ హైకోర్టు గురువారం విచారణకు స్వీకరించిన సందర్భంగా తీవ్ర వాగ్వివాదాలు జరిగాయి. ఈ క్రమంలో మోసానికి గురైనట్టుగా చెబుతున్న బాధిత మహిళ యొక్క ఫోటోలను పంచారు. ఇది బాధితురాలికి అవమానకరమైనది, ఆమెను నిస్సహాయ స్థితికి చేర్చే చర్య. 

అయితే, Mrugender Lal Banothను అరెస్టు చేస్తే IAS trainee అధికారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని నిందితుడి తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఈ మేరకు, జస్టిస్ లలిత విచారణకు సహకరించాలని ఆదేశిస్తూ 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. దీంతోపాటు అతడికి potency test కూడా నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.

బెయిల్ మంజూరు చేసే ముందు తన వాదనలను కూడా స్వీకరించాలని కోర్టును అభ్యర్థిస్తూ బాధితుడు వేసిన ఇంప్లీడ్ పిటిషన్ కేసులో ట్విస్ట్‌కు దారితీసింది. భానోత్‌ తరపు న్యాయవాది దేవినేని రాధారాణి వాదిస్తూ, నిందితుడి బంధువు (మహిళ) తను క్రియేట్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్ లో nudeగా ఫొటోలు పంచిన కేసులో గతంలో ఆమెపై కేసు నమోదు కావడంతో బాధితురాలు కౌంటర్‌ బ్లాస్ట్‌గా తన క్లయింట్‌పై rape caseపెట్టిందని వాదించారు. దీంతో ఆ కేసు స్టేటస్‌ను సమర్పించాలని కోర్టు పోలీసులను కోరింది.

అసభ్యకరమైన ఫోటోలతో నిండి ఉన్న ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపామని, నివేదిక కోసం వేచి చూస్తున్నామని పోలీసులు గురువారం కోర్టుకు తెలిపారు. అత్యాచారం కేసులో ఏడుగురు సాక్షులను కూడా విచారించామని, నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాల కారణంగా తదుపరి చర్యలు తీసుకోలేమని పోలీసులు నివేదిక సమర్పించారు.

వెంటనే, బాధితుడి తరఫు న్యాయవాది ఎస్. రాజగోపాల్ మాట్లాడుతూ, భానోత్, అతని కుటుంబం బాధితురాలిపై కేసు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రచారంలో ఉన్న ఫోటోలు బాధితురాలివేనని, భానోత్ బంధువువి కాదన్నారు. తన క్లయింట్‌పై కేసు నమోదు చేయడానికి ముందు, భానోత్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, అతని భార్య బాధితురాలి ఇంటికి వెళ్లి రెండు పర్యాయాలు రాజీ కుదుర్చుకున్నారని కూడా ఆయన తెలిపాడు.

ఈ సమయంలో, భానోత్ న్యాయవాది text messagesతో పాటు మహిళ, ఫోటోలను సమర్పించారు. బాధితురాలు టెలిగ్రామ్ గ్రూప్‌లో పురుష సభ్యుడిగా నటించి, అది భానోత్ కజిన్‌కి చెందినదని చెబుతూ తన ఫోటోలను ఫార్వార్డ్ చేస్తున్నట్లు దాంట్లో తెలిపారు. ఆమె తన వాదనను మరింత ముందుకు తీసుకువెళ్లి, వివాహ వాగ్దానంతో ఏకాభిప్రాయంతో ఏర్పడే లైంగిక సంబంధం రేప్‌గా పరిగణించబడదన్న సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కూడా ఉటంకించింది.

దీనికి బాధితురాలి తరపు న్యాయవాది రాజగోపాల్ అభ్యంతరం తెలిపారు. భానోత్ తరపు న్యాయవాది బాధితురాలి character assassinationకు పాల్పడుతున్నారని అనడంతో అది తీవ్ర వాదనలకు దారితీసింది.

Crypto Currency : సూర్యాపేటలో ఖమ్మం వ్యాపారి ఆత్మహత్య, బయటపడుతున్న నకిలీ క్రిప్టో కరెన్సీ మూలాలు..

ఈ తరుణంలో జోక్యం చేసుకున్న జస్టిస్ కన్నెగంటి లలిత ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికపై అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ విజరత్‌ను విచారించారు. ఒక మహిళ తన అశ్లీల ఫోటోలను ఎలా circulate చేస్తుందని, అలా చేసి ఇతరులపై ఆరోపణలు ఎలా చేస్తుందని న్యాయమూర్తి భానోత్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. "ఏ స్త్రీ అయినా ఇలాంటి పనులు చేస్తుందా?" అని ప్రశ్నించారు. అంతే కాదు “ట్రైనీ ఆఫీసర్ ఇలా ప్రవర్తించడం ఏంటీ?  IPS ట్రైనీ అయితే మాత్రం.. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనవచ్చా? అది కూడా training place లో? ఇలా చేసే వ్యక్తి రేపటి రోజు ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తాడు?” అని ఘాటుగా ప్రశ్నించారు. 

ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికకు సమయం పడుతుందని APP సమర్పించింది, అయితే ఫోటోలు ఫార్వార్డ్ చేయబడిన ఫోన్ నంబర్ victim పేరు మీద లేదని అందులో సమర్పించారు. అయితే గతంలో ఇదే నంబర్‌ను ఉపయోగించిన మరో వ్యక్తిపై కూడా పోలీసులు రెండో నిందితుడిగా కేసు నమోదు చేశారు.

ఈ రెండు కేసులను అనుసంధానం చేయలేమని APP సమర్పించింది. సుప్రీంకోర్టు కేసును ఉటంకిస్తూ IAS ట్రైనీ ప్రవర్తన అత్యాచారానికి సమానమని పేర్కొంది. బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. భానోత్ తల్లిదండ్రులకు ఉపశమనం ఇస్తూ, ఈ కేసులో వారు హాజరు కావాలంటే తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios