అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ ను సోమ‌వారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారించింది. ఈ విచార‌ణ‌లో జ‌గ‌న్ పై ఉన్నా.. 11 ఛార్జీషీట్లను ర‌ద్దు చేసి.. విచారించాల‌ని కోరారు. జగన్ బయట ఉంటే తన పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు వైసీపీ రెబెల్ ఎంపీ.  

Telangana High Court: ఆంధ్రప్ర‌దేశ్ సీఎం జగ‌న్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా జగన్‌కు నోటీసులు జారీ చేసింది. 

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి బెయిల్ రద్దు చేయాల‌ని, ఆయ‌న‌పై ఉన్న‌ 11 ఛార్జిషీట్లను విచారించాలంటూ పిటిష‌న్ లో పేర్కొన్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ. జగన్ బయట ఉంటే.. తన పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్ర‌త్యేక్షంగానో, ప‌రోక్షంగానో ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, ఈ కేసులో వెంట‌నే విచారణ చేయాలని చేయాల‌ని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై కేసులను త్వరితగతిన ముగించాలని, జగన్ బెయిల్ రద్దు చేసి అన్ని ఛార్జిషీట్లపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యంలో జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Read also: జగన్ సర్కార్ కు హైకోర్ట్ లో షాక్... రివ్యూ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం

అయితే.. నోటీసులకు జగన్ ఇచ్చే సమాధానాన్ని బట్టి హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని గతంలో రఘురాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సంబంధించి జగన్మోహన్ రెడ్డి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఆ తర్వాత దానిపై ఎలాంటి ఎలాంటి రిప్లై ఇస్తారు. ఈ రోజు కొనసాగుతున్న లేకపోతే ఎలా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి జగన్మోహన్రెడ్డి అయిన తర్వాత రెండు వారాల తర్వాత వాళ్ళు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఒక క్లారిటీ గా కనబడుతుంది