తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు చుక్కెదురు: కౌంటర్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేకంగా దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది.
హైదరాబాద్: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.గాదరి కిషోర్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నిక చెల్లదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని గాదరి కిషోర్ కౌంటర్ పిటిషన్ ను దాఖలు చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.ఎన్నికల ఫలితాలు, కౌంటింగ్ వీడియో పుటేజీని ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
2018 ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా గాదరి కిషోర్, కాంగ్రెస్ అభ్యర్ధిగా అద్దంకి దయాకర్ లు పోటీ చేశార. కాంగ్రెస్ అభ్యర్ధి అద్దంకి దయాకర్ పై 1847 ఓట్ల మెజారిటీతో గాదరి కిషోర్ కుమార్ విజయం సాధించారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో 2019లో అద్దంకి దయాకర్ పిటిషన్ దాఖలు చేశారు. పోలైన ఓట్లకు, కౌంటింగ్ లో ఓట్లకు తేడాలున్నాయని అద్దంకి దయాకర్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తుంది. అయితే అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని ఈ ఏడాది ఆగస్టు 28న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది.