జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌లో నేరెడ్‌మెట్ ఫలితం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అప్పీల్ చేసింది.

దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ శనివారం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసంన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.

అయితే నెరేడ్‌మెట్ ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన కోర్టు.. సిబ్బంది శిక్షణ లోపమే ఇందుకు కారణంగా అభిప్రాయపడింది.

సోమవారం విచారణ ఉన్నందున అత్యవసర జోక్యం లేదని హైకోర్టు తెలిపింది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.