బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించని గ్రూప్-1 పరీక్ష మరోసారి రద్దైంది.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించని గ్రూప్-1 పరీక్ష మరోసారి రద్దైంది. గతంలో పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా హైకోర్టు పేర్కొంది. ఈ పరీక్ష సందర్భంగా బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడంతో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేయాలని కోరారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.