రాష్ట్రంలో ప్రభుత్వ భూములు విక్రయించడానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం గురువారం హైకోర్టు విచారణ జరిపింది.
రాష్ట్రంలో ప్రభుత్వ భూములు విక్రయించడానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం govt landsను విక్రయించడాన్ని తప్పుపట్టలేమని హైకోర్టు పేర్కొంది. భూముల విక్రయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని స్పష్టం చేసింది. టెండర్లు, ఈవేలం వంటి పారదర్శక విధానాలు పాటించాలని సూచించింది. విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ ముగించింది.
ఇక, తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ భూములను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయశాంతి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మితే తెలంగాణ పేద రాష్ట్రం అవుతుందని ఆమె అన్నారు. ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి కేసీఆర్ తన బంధువులకు వేలం పాటకు కట్టబెట్టారని ఆరోపిస్తూ.. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించకుండా అడ్డుకునేందుకే తాను కోర్టును ఆశ్రయించానని గతంలో విజయశాంతి చెప్పారు.
