ఒమిక్రాన్ కేసుల (Omicron)కాంటాక్ట్స్‌పై తెలంగాణ వైద్యశాఖ (telangana health department) ఫోకస్ పెట్టింది. కంటైన్మెంట్ జోన్‌గా (containment zone) పారామౌంట్ కాలనీని (paramount colony) ప్రకటించారు. అంతకుముందు సోమాలియా నుంచి వచ్చిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌ను ఎట్టకేలకు ట్రేస్ అవుట్ చేశారు అధికారులు
ఒమిక్రాన్ కేసుల (Omicron)కాంటాక్ట్స్‌పై తెలంగాణ వైద్యశాఖ (telangana health department) ఫోకస్ పెట్టింది. కంటైన్మెంట్ జోన్‌గా (containment zone) పారామౌంట్ కాలనీని (paramount colony) ప్రకటించారు. అపోలో, యశద ఆసుపత్రులకు తండ్రికి చికిత్స కోసం వెళ్లాడు యువకుడు. దీంతో రెండు ఆసుపత్రుల్లో అలెర్ట్ అయ్యారు సిబ్బంది. యువకుడితో పాటు అతని తండ్రిని, కాంటాక్ట్ అయిన వాళ్లని అధికారులు ఐసోలేషన్‌లో వుంచారు.
అంతకుముందు సోమాలియా నుంచి వచ్చిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌ను ఎట్టకేలకు ట్రేస్ అవుట్ చేశారు అధికారులు. పారామౌంట్ కాలనీ బంజారాహిల్స్ వద్ద సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేస్తున్నారు. అబ్దుల్లాహి అహ్మద్ నూర్ ఎక్కడెక్కడ తిరిగింది ఆరా తీసి అతనితో కాంటాక్ట్ అయిన వారిని ట్రేసింగ్ చేస్తున్నారు. తండ్రి వైద్యం కోసం సోమాలియా నుంచి వచ్చిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్ తప్పిపోవడంతో తెలంగాణ ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
Also Read:Omicron in Hyderabad: హైదరాబాద్ లో ఒమిక్రాన్ టెన్షన్ .. క్రమంగా పెరుగుతోన్న కేసులు
అర్ధరాత్రి 2 గంటల నుంచి అతన్ని ట్రేస్ చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, వైద్య అధికారులు ఎట్టకేలకు గుర్తించి అతడు తిరిగిన, కాంటాక్ట్ అయిన ప్రదేశాలపై దృష్టి సారించారు. నగరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సోమాలియన్ ఫ్యామిలీ నిన్న రెస్టారెంట్ కు కూడా వెళ్లినట్లు తేలడంతో అతడు ఉంటున్న ఇంటితోపాటు మిగిలిన ప్రదేశాల్లో కూడా శానిటైజ్ చేస్తూ టెస్టులు ముమ్మరం చేస్తున్నారు.
మరోవైపు సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్.. ప్రపంచ దేశాలకు క్రమంగా పాకుతోంది. ఈ వేరియంట్ కేసులు భారత్ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అలాగే..ఢిల్లీలో నాలుగు, రాజస్తాన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. దీంతో కేంద్ర, రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
