Asianet News TeluguAsianet News Telugu

102 వాహనంలో 13 మంది గర్భిణీలు, వాహన సిబ్బందికి కరోనా: 11 మంది హోం క్వారంటైన్‌కి

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని 11 మంది గర్భిణీలను హోం క్వారంటైన్  చేశారు అధికారులు.

Telangana health officers suggests 11 pregnant woman send to home quarantine
Author
Hyderabad, First Published Apr 30, 2020, 5:43 PM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లిలోని 11 మంది గర్భిణీలను హోం క్వారంటైన్  చేశారు అధికారులు.

ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన 13 మంది గర్భిణీలు 102 వాహనంలో చెకప్ కోసం ఇటీవల కాలంలో కోఠి ఆసుపత్రికి వెళ్లారు. 102 వాహనంలో విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి కరోనా సోకింది. 

అయితే ఈ విషయం ఆలస్యంగా తేలింది. దీంతో ఈ వాహనంలో కోఠి ఆసుపత్రికి వెళ్లిన గర్భిణీలను సెకండరీ కాంటాక్ట్ కింద హోం క్వారంటైన్ కి తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

ఈస్ట్ మారేడ్‌పల్లిలోని 13 మంది గర్భిణీల్లో ఇద్దరు  డెలీవరీ అయ్యారు. దీంతో  మరో 11 మందిని హోం క్వారంటైన్ కు తరలించారు. కరోనా లక్షణాలు కన్పిస్తే తమను సంప్రదించాలని వైద్యాధికారుల ఫోన్ నెంబర్లను ఈ గర్భిణీలకు అందించారు.ఈ 11 మంది గర్భిణీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆ కుటుంబాలకు వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. 

also read: కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల ధరఖాస్తుల గడువు పెంపు...

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,016కి చేరుకొన్నాయి. ఇందులో ఎక్కువగా జీహెచ్ఎంసీలోనే ఉన్నాయి. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios