హైదరాబాద్: తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల ధరఖాస్తుల స్వీకరణ గడువును తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పొడిగించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది.

తెలంగాణ రాష్ట్రంలో పలు కాంపిటిటీవ్ పరీక్షలకు సంబంధించి ప్రవేశ పరీక్షల గడువును పెంచుతూ గురువారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది.

మే 15వ తేదీ వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఎంసెట్, ఈసెట్, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, లాసెట్, పీజీఎల్ సెట్ ధరఖాస్తులకు గడువును పెంచుతున్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

పలు పరీక్షల ప్రవేశ పరీక్షల గడువును గతంలోనే ఓసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది ఉన్నత విద్యామండలి. ఈ నెల 20వ తేదీ వరకు గతంలో గడువును పొడిగించింది. లాక్ ‌డౌన్ ను ఏప్రిల్ 14 నుండి మే 3 వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. దీంతో  ప్రవేశ పరీక్షల నిర్వహణను కూడ వాయిదా వేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.

మే 7వ తేదీతో తెలంగాణలో లాక్ డౌన్ ముగియనుంది. ఈ తరుణంలో పలు కాంపిటీటీవ్ పరీక్షలకు ధరఖాస్తు చేసుకొనే గడువును  మే 15వ తేదీ వరకు పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసుకొంది.

Also read:కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలి: తెలంగాణ సర్కార్‌కి అఖిలపక్షం వినతి...

షెడ్యూలు ప్రకారం మే 2న ఈసెట్ పరీక్ష నిర్వహించాలి. మే 5 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో మే 5నుండి 7 మధ్య ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 9, 11 తేదీల్లో మధ్య అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

మే 13న పీఈసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్) పరీక్ష నిర్వహించనున్నారు. మే 20, 21 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 23న ఎడ్‌సెట్ పరీక్ష, మే 25న లాసెట్-పీజీలాసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇక చివరగా మే 27 నుంచి 30 వరకు నిర్వహించనున్న పీజీఈసెట్ పరీక్షలతో సెట్ పరీక్షలు ముగియనున్నాయి.

ఈసెట్, ఎంసెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతను జేఎన్‌టీయూ హైదరాబాద్ చేపట్టింది. పీఈసెట్ పరీక్షను నల్గొంలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ, ఐసెట్ పరీక్షను వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఇక ఎడ్‌సెట్,లాసెట్, పీజీఈసెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.