Asianet News TeluguAsianet News Telugu

కరోనా జోరు.. వేధిస్తున్న బెడ్ల కొరత: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో 25 శాతం కరోనా బెడ్స్ పెంచాలని ఆదేశించింది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలెక్టీవ్ ఆపరేషన్లు వాయిదా వేయాలని సూచించింది.

telangana health ministry decides to increase covid beds ksp
Author
Hyderabad, First Published Apr 15, 2021, 7:15 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో 25 శాతం కరోనా బెడ్స్ పెంచాలని ఆదేశించింది.

అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలెక్టీవ్ ఆపరేషన్లు వాయిదా వేయాలని సూచించింది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా బెడ్స్ పెంచాలని ఆదేశించింది. కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్‌ను జారీ చేసింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పడకల వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నటువంటి 9,281 పడకలకు 6,654 ఖాళీగా ఉన్నాయని తెలిపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 3,843 పడకలుండగా.. వాటిలో 2,649 అందుబాటులో ఉన్నాయని వివరించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios