తెలంగాణలో కరోనా వైరస్ జాడలు బయటపడిన నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

Also Read:హైదరాబాద్‌లో ఒకరికి కరోనా వైరస్: నిర్ధారించిన అధికారులు

తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్‌గా ఉందని రాజేందర్ తెలిపారు. సోమవారం ఇద్దరిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తిలో కోవిడ్-19 లక్షణాలు బయటపడ్డాయి.

Also Read:టెక్నాలజీ దిగ్గజాలపై కరోనా ‘పడగ’: ఉద్యోగుల ప్రయాణంపై ఆంక్షలు

మరో కేసులో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా జాడ కనిపించింది. ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పరిస్ధితిని సమీక్షిస్తోంది. కరోనా వార్తలు వచ్చిన వెంటనే తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.