రాష్ట్రంలో కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

మంగళవారం ఆయన సూర్యాపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్‌లో సరిహద్దు రాష్టాలతో పాటు తెలంగాణలో కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. నూటికి 95 శాతం పేషేంట్స్‌కు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం లేకుండా చికిత్స పొందుతున్నారన్నారు.

కేవలం 5 శాతం మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నామన్నారు. ఏడాది కాలంగా 99.5 శాతం నయమై ఇంటికి వచ్చారన్నారు. రాష్ట్రంలో వందల సెంటర్లలో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దని, ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఈటల తెలిపారు.