Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

తెలంగాణ రాష్ట్రంలో  రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. 
 

Telangana government imposes night curfew night 9 pm to morning 5 am till may 1
Author
Hyderabad, First Published Apr 20, 2021, 11:38 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.

 

మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఐటీ, ఈ కామర్స్ వస్తువుల పంపిణీ, పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లకు కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా విభాగాలు, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజేస్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ లకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభించింది.గర్భిణీలు, రోగులు మెడికల్ సేవలు పొందవచ్చు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల నుండి ఇళ్లకు వెళ్లేవారంతా టికెట్లను చూపాలని ప్రభుత్వం ప్రకటించింది.నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మెడికల్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తమ వెంట గుర్తింపు కార్డులు ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. 

అంతరాష్ట్ర, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు నిత్యావసర, అత్యవసర , ఇతర సరుకుల రవాణా కోసం ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల తర్వాత ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై  తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  కర్ప్యూ లేదా వీకేండ్ లాక్ డౌన్ విధిస్తారా లేదా తామే నిర్ణయం తీసుకోవాలా అని  హైకోర్టు వ్యాఖ్యానించింది.   48 గంటల్లో ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని  హైకోర్టు ఆదేశించింది.దీంతో  రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాత్రి నుండి  నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకొంది. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కి కూడ కరోనా సోకింది. ఆయన తన ఫాం హౌజ్ లో  క్వారంటైన్ లో ఉన్నారు. నైట్ కర్ఫ్యూ విధించడం వల్ల పబ్ లు, క్లబ్ లు మూతపడనున్నాయి. వీటి కారణంగానే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios