Asianet News TeluguAsianet News Telugu

మందులు, ఆక్సిజన్ పొదుపుగా వాడండి: ఆసుపత్రులకు తెలంగాణ వైద్యశాఖ సూచన

తెలంగాణలో కరోనా భయంకరంగా మారుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లో కరోనా వేగంగా విస్తరిస్తూ వుండటంతో తెలంగాణలో గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. 

telangana health department suggestions to hospitals ksp
Author
Hyderabad, First Published Apr 16, 2021, 7:16 PM IST

తెలంగాణలో కరోనా భయంకరంగా మారుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌లో కరోనా వేగంగా విస్తరిస్తూ వుండటంతో తెలంగాణలో గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది.

ప్రతి పది నిమిషాలకు ఒక కరోనా రోగి గాంధీ ఆసుపత్రికి చేరుతున్నాడు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలోని వెంటిలేటర్ బెడ్స్ నిండిపోయాయి. కరోనా రోగుల కోసం నాన్ కోవిడ్ విభాగాల్లో రోగులను ఖాళీ చేయిస్తున్నారు వైద్యులు.

Also Read:గాంధీలో రేపటి నుండి కరోనా రోగులకే చికిత్స: బెడ్స్ పెంపు

రేపటి నుంచి మరోసారి పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా గాంధీని మార్చనున్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా వుందంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అంతేకాకుండా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు.

అందుకే గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రేపటికి ఒక్కరోజే వ్యాక్సిన్ వుందని అయితే వ్యాక్సినేషన్ మాత్రం కేంద్రం పరిధిలో వుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రోగులుకు వున్న లక్షణాలకు మాత్రమే ట్రీట్‌మెంట్ చేస్తున్నామని తెలిపారు. మందులు, ఆక్సిజన్ అన్నీ జాగ్రత్తగా వుపయోగించాలని శ్రీనివాసరావు వెల్లడించారు.     

Follow Us:
Download App:
  • android
  • ios