కట్నం కింద పాత సామాన్లు.... పెళ్లి ఆపేసిన వరుడు..!
వరుడి ఇంటికి వెళ్లి ఎందుకు పెళ్లి సమయానికి రాలేదని అడగగా... తాను కోరిక సామాను ఇవ్వలేదని వరుడు చెప్పడం గమనార్హం.
పెళ్లి అంటే చాలా ఉంటాయి. పెళ్లి అంటే ఆనందం మాత్రమే కాదు.. పెళ్లి కొడుకు వాళ్లకు ఎలాంటి లోటు కాకుండా చూసుకోవాలి. చికెన్ ముక్క తక్కువైందని కూడా పెళ్లి ఆగిన సందర్భాలు ఉన్నాయి. కాగా... తాజాగా ఓ వరుడు చివరి నిమిషంలో పెళ్లి ఆపేశాడు. కట్నం కింద పాత సామాన్లు ఇచ్చారనే కారణంతో.. పెళ్లి ఆపేశాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరానికి చెందిన బస్ డ్రైవర్ కి పెళ్లి కుదిరింది. పెళ్లికి కట్నం కింద కొంత సామాను ఇస్తామని వధువు తల్లిదండ్రులు చెప్పారు. చెప్పినట్లే ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే... తీరా తాళి కట్టే సమయానికి వరుడు మండపానికి రాలేదు. దీంతో వధువు తరపు బంధువులు షాకయ్యారు. వరుడి ఇంటికి వెళ్లి ఎందుకు పెళ్లి సమయానికి రాలేదని అడగగా... తాను కోరిక సామాను ఇవ్వలేదని వరుడు చెప్పడం గమనార్హం. అందుకే తాను మండపానికి రాలేదని చెప్పాడు. దీంతో.. వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
సోమవారం పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడు రాకపోవడం వల్ల.. పెళ్లి ఆగిపోయిందని చెప్పారు. తాను బంధువులు అందిరనీ ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేసినా.. వరుడు రాకపోవడంతో పెళ్లి ఆగిపోయినట్లు అతను వాపోయాడు. కారణం అడిగితే.. కట్నంలో పాత సామాన్లు ఇచ్చారని చెబుతున్నాడని వధువు తండ్రి బాధను వ్యక్తం చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వరుడుని బతిమిలాడటానికి వెళితే... అతని తండ్రి.. వధువు తండ్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట. కాగా.. ఐపీసీ, వరకట్న నిషేధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.