జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వ హెచ్చరికలను జేపీఎస్‌లు పట్టించుకోవడం లేదు. సమ్మెకే వీరు సై అంటున్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరని పక్షంలో ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరించింది. అయితే ప్రభుత్వ హెచ్చరికలను జేపీఎస్‌లు పట్టించుకోవడం లేదు. సమ్మెకే వీరు సై అంటున్నారు. ప్రభుత్వాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. నోటిఫికేషన్ సమయంలో జేపీఎస్‌లకు మూడేళ్ల సర్వీస్ వుంది. అయితే దానిని జీవో నెంబర్ 26తో వీరి సర్వీస్‌ను మరో ఏడాది పెంచింది ప్రభుత్వం. మరోవైపు జేపీఎస్‌లకు కాంగ్రెస్, బీజేపీలు మద్ధతుగా నిలిచాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
