Asianet News TeluguAsianet News Telugu

అమీర్‌పేట మెట్రో ప్రమాదంపై సర్కార్ సీరియస్: విచారణకు ఆదేశం

అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో వివాహిత మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రమాదంపై ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ చేయించాల్సిందిగా ఆదేశించింది

telangana Govt serious on ameerpet metro accident
Author
Hyderabad, First Published Sep 23, 2019, 5:42 PM IST

అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో వివాహిత మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రమాదంపై ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ చేయించాల్సిందిగా ఆదేశించింది.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

కాగా కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక అనే వివాహిత ఆదివారం సాయంత్రం వర్షం పడుతుండటంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు. ఆ సమయంలో పిల్లర్‌పైన ఉణ్న మెట్రో కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి.

తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. రక్తపు మడుగులో ఉన్న మౌనికను స్ధానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక మృతి: కోదండరామ్

హైదరాబాద్ మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి లేడీ టెక్కీ మృతి

మెట్రో స్టేషన్ లో మౌనిక మృతి... రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్

Follow Us:
Download App:
  • android
  • ios