ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. దసరా నుంచి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దసరా రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ పాఠశాల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దసరా రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అల్పాహారం అందించనున్నారు.
పిల్లలకు విద్యా బోధనతో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉదయాన్ని పనులకు వెళ్లే తల్లిదండ్రులు విద్యార్ధులకు అల్పాహారాన్ని అందించడం కష్టంగా వున్నందున వారి ఇబ్బందులను కేసీఆర్ అర్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ స్కీమ్ వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.400 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
తమిళనాడులో అమలవుతున్న అల్పాహార పథకాన్ని స్పూర్తిగా తీసుకున్నారు కేసీఆర్. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులను అధ్యయనం నిమిత్తం అక్కడికి పంపారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారి స్మితా సభర్వాల్ ఇతర ఉన్నతాధికారులు చెన్నైలోని రాయపురంలోని వంటశాలను, అక్కడి ఆరత్తూన్ రోడ్డులోని ఉర్దూ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న అల్పాహారాన్ని రేచి చూశారు.