Asianet News TeluguAsianet News Telugu

Traffic E-challan: బిగ్ అలర్ట్.. ఇవాళ్టితో ముగియనున్న పెండింగ్ చలాన్స్ ఆఫర్..

Pending Challans: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్‌‌‌‌ పెండింగ్ చలాన్స్‌‌‌‌ పై తెలంగాణ సర్కార్ ప్రకటించిన భారీ డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌ నేటీతో ముగియనుంది. గత నెల 26న ప్రారంభమైన ఆఫర్‌‌‌‌‌‌‌‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. 

Telangana Govt offers discount on traffic pending challan, this offer closed today KRJ
Author
First Published Jan 10, 2024, 8:32 AM IST

Pending Challans: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్‌‌‌‌ పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ నేటీతో ముగియనుంది. గత నెల 26 న ప్రారంభమైన ఈ ఆఫర్ కు భారీ స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల  పెండింగ్ చలాన్స్ ఉండగా.. మంగళవారం వరకు 1.14 కోట్ల చలాన్స్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. 

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ పరిథిలో చలాన్స్‌‌‌‌ క్లియర్ అయ్యాయటా. పెండింగ్ చలాన్లను చెల్లించడానికి ఇవాళ ఒక్కరోజే సమయం ఉండడంతో వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా పెండింగ్‌ చలాన్‌లను చెల్లించకపోతే.. వారు వెంటనే చలాన్ చెల్లించాలనీ, మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని పేర్కొంటున్నారు.
 
ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీని ప్రకటించగా.. బైక్‌లపై 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలకు 50 శాతం తగ్గింపుతో భారీ రాయితీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదని.. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న చలాన్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ చెల్లుతుందని రేవంత్ సర్కార్ చెప్పుబుతోంది.

ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించింది. ఈ భారీ ఆఫర్ మరికొన్ని గంటలలో ముగియనుండటంతో వాహనదారుల ఒక్క సారిగా అలర్ట్ అయ్యారు. పెండింగ్ చలాన్లు ఉంటే మీరు కూడా వెంటనే చెల్లించండి. ఈ ఆఫర్ మిస్సయితే.. తరువాత భారీ మొత్తంలో కట్టాల్సి ఉంది. సో.. బీ అలర్ట్.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios