రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ టీవీ, సినిమా షూటింగులు చేసుకోవచ్చునని ఉత్తర్వుల్లో తెలిపింది.

మాస్క్, భౌతిక దూరం తప్పనిసరని సూచనలు చేస్తూ.. షూటింగ్ స్పాట్‌లలో డాక్టర్లు తప్పకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఎంట్రీ, ఎగ్జిట్ స్పాట్‌లతో పాటు కామన్ ఏరియాల్లో హ్యాండ్ వాష్, గ్లౌజులు, శానిటైజర్లు తప్పనిసరిగా ఉండాలని నిబంధనల్లో పేర్కొంది.

Also Read:షూటింగ్‌లు షురూ.. ఓకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. కండిషన్స్‌ అప్లై

షూటింగ్ ఏరియాల్లో పొగాకు, పాన్‌లను నిషేధించడంతో పాటు స్టూడియోల్లోకి విజిటర్లకు అనుమతి నిరాకరించింది. ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తీసుకోవడం తప్పనిసరని, నిబంధనల్లో పొందుపరిచింది.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా షూటింగ్‌లకు కూడా ఓకె చెప్పింది. థియేటర్లను మాత్రం ఇప్పటికే ప్రారంభించే పరిస్థితి లేదని చెప్పారు.

లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు 75 రోజులుగా సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. దీంతో వేలాది కార్మికులు నటీనటులు ఉపాది లేక కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Also Read:కరోనా కష్టాలు.. అద్దె కట్టలేక ఇళ్లు ఖాళీ చేసిన నటుడు

చిరంజీవి నేతృత్వంలో పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు సీఎం కేసీఆర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లకు కూడా అనుమతి ఇచ్చింది.

పరిమిత సంఖ్యలో క్రూ మెంబర్స్‌ ఉండేలా చూసుకోవాలని, తరుచూ లోకేషన్‌లో సానిటైజేషన్‌ చేయాలని, పదేళ్ల లోపు 60 ఏళ్ల పైగా వయసున్న వారితో షూటింగ్‌లు చేయకూడాదని ప్రభుత్వం నిబంధనలు విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా షూటింగ్లు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.