Asianet News TeluguAsianet News Telugu

షూటింగ్‌లు షురూ.. ఓకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. కండిషన్స్‌ అప్లై

తెలంగాణ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతిస్తూ ఉత్తర్వులూ జారీ చేసింది. ఈ మేరకు ఈ రోజు సమీక్ష నిర్వహించన కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయితే షూటింగ్ లోకేషన్‌లో కేంద్ర మార్గదర్శాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Film and TV shoots can begin in Telangana with certain conditions
Author
Hyderabad, First Published Jun 8, 2020, 4:40 PM IST

లాక్‌ డౌన్‌ సండలింపుల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టీవీ, సినిమా షూటింగ్‌ లకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఈ రోజు సీ ఎం కేసీఆర్ ఫైల్‌పై సంతకం కూడా చేశారు. అయితే షూటింగ్ సమయంలో ఖచ్చితంగా కోవిడ్‌ 19 నివారణ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌కు సంబంధించి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా షూటింగ్‌లకు కూడా ఓకె చెప్పింది. థియేటర్లను మాత్రం ఇప్పటికే ప్రారంభించే పరిస్థితి లేదని చెప్పారు.

లాక్‌ డౌన్‌ కారణంగా దాదాపు 75 రోజులుగా సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. దీంతో వేలాది కార్మికులు నటీనటులు ఉపాది లేక కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. చిరంజీవి నేతృత్వంలో పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు సీఎం కేసీఆర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. దీంతో స్పందించిన ప్రభుత్వం లాక్‌ డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లకు కూడా అనుమతి ఇచ్చింది.

పరిమిత సంఖ్యలో క్రూ మెంబర్స్‌ ఉండేలా చూసుకోవాలని, తరుచూ లోకేషన్‌లో సానిటైజేషన్‌ చేయాలని, పదేళ్ల లోపు 60 ఏళ్ల పైగా వయసున్న వారితో షూటింగ్‌లు చేయకూడాదని ప్రభుత్వం నిబంధనలు విధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా షూటింగ్లు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios