Asianet News TeluguAsianet News Telugu

నోటీసులు బేఖాతరు: విరించి ఆసుపత్రిపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర.. ఆంక్షలు విధింపు

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి విరించి హాస్పిటల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కోవిడ్ బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం.. విరించికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

telangana govt imposed restrictions on virinchi hospital ksp
Author
Hyderabad, First Published May 28, 2021, 7:38 PM IST

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి విరించి హాస్పిటల్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కోవిడ్ బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం.. విరించికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇంత వరకు ఆసుపత్రి యాజమాన్యం దీనిపై స్పందించలేదు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ.. విరించి ఆసుపత్రిపై ఆంక్షలు విధించింది. కొత్తగా కరోనా రోగులను చేర్చుకోవద్దని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. అలాగే ప్రస్తుతం చికిత్స పొందుతున్న పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని తన ఆదేశాల్లో పేర్కొంది. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. తమ ఆదేశాలు అమలు చేయకుంటే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది. 

Also Read:తెలంగాణ: కరోనా తగ్గుముఖం.. కొత్తగా 3961 కేసులు, 18 మంది మృతి

కాగా, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా వుందంటూ బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చేరాడో వ్యక్తి. అయితే 9 రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు దాదాపు రూ. 20 లక్షల బిల్లు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ ఒత్తిడి చేశారు.

మృతుడి చెల్లెలు డాక్టర్ కావడంతో ఆమె బంధువులతో కలిసి విరించి ఆసుపత్రి నిర్వాహకులను నిలదీసింది. 20 లక్షల బిల్లు ఎలా అయ్యిందో చెప్పాలని గట్టిగా అడిగింది. దాంతో రూపాయి కూడా బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని మృతదేహాం తీసుకెళ్లొచ్చని చెప్పారు. అలాంటప్పుడు 20 లక్షల బిల్లు వేశారని గొడవకు దిగారు. కోపంతో ఆసుపత్రిపై దాడికి దిగారు. దీనిపై సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సర్కార్.. నోటీసులు జారీ చేసింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios