తెలంగాణ: కరోనా తగ్గుముఖం.. కొత్తగా 3961 కేసులు, 18 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,614 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3,961 మంది కోలుకోగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,67,517కు చేరింది

3961 new corona cases reported in telangana ksp

తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,614 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3,961 మంది కోలుకోగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,67,517కు చేరింది.

అలాగే మొత్తం డిశ్చార్జిల సంఖ్య 5,26,043కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,267 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు కోవిడ్ వల్ల మొత్తం 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం 90,226 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ పరిధిలో అత్యధికంగా 504 మందికి కోవిడ్ సోకింది. 

Also Read:88 ఫిర్యాదులు.. 24 గంటల్లో వివరణ ఇవ్వాలి: ప్రైవేట్ ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ ఆదేశం

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 142, జగిత్యాల 66, జనగామ 34, జయశంకర్ భూపాలపల్లి 59, జోగులాంబ గద్వాల 58, కామారెడ్డి 21, కరీంనగర్ 196, ఖమ్మం 228, కొమరంభీం ఆసిఫాబాద్ 22, మహబూబ్‌నగర్ 123, మహబూబాబాద్ 137, మంచిర్యాల 91, మెదక్ 44, మేడ్చల్ మల్కాజిగిరి 204, ములుగు 53, నాగర్ కర్నూల్ 84, నల్లగొండ 229, నారాయణ పేట 23, నిర్మల్ 18, నిజామాబాద్ 60, పెద్దపల్లి 130, రాజన్న సిరిసిల్ల 61, రంగారెడ్డి 192, సంగారెడ్డి 86, సిద్దిపేట 130, సూర్యాపేట 147, వికారాబాద్ 91, వనపర్తి 88, వరంగల్ రూరల్ 110, వరంగల్ అర్బన్ 123, యాదాద్రి భువనగిరిలలో 46 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios