దివ్యాంగుల ఆసరా పెన్షన్ పెంచిన కేసీఆర్ సర్కార్ .. ఈ నెల నుంచి అమల్లోకి, ఎంతంటే.?
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందజేసే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. అలాగే పెరిగిన పెన్షన్‌ను ఈ నెల నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు అందజేసే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి పెంచింది. పెరిగిన పెన్షన్‌ను ఈ నెల నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది.