Holiday: రేపు సంత్ సేవాలాల్ జయంతి.. వీరందరికీ సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రేపు సంత్ సేవాలాల్ జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం స్పషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న బంజారా కమ్యూనిటీ ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తించనుంది.
 

telangana govt declared holiday as tomorrow special casual leave for banjara community kms

CM Revanth Reddy: రేపు బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. ఫిబ్రవరి 15వ తేదీన ఆయన జయంతిని బంజారా కమ్యూనిటీ ఘనంగా జరుపుకుంటుంది. చాలా కాలం నుంచి ఆయన జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించాలనే డిమాండ్ లంబాడా సంఘాల నుంచి ఉన్నది. తాజాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి డిమాండ్లను ఆలకించింది.

ఫిబ్రవరి 15వ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం శాఖల్లో పని చేస్తున్న బంజారా కమ్యూనిటీ ఉద్యోగులు అందరికీ ఈ సెలవు వర్తించనుంది. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లంబాడా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

Also Read: Wedding: గల్ఫ్‌లో జరిగిన పెళ్లి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఒక్క చోటికి తెచ్చింది! ఇంతకీ వారెవరు?

సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాగఢ్‌లో జన్మించారని చెబుతారు. ఆయన ఆధ్యాత్మిక గురువు, సంఘసంస్కర్త. నిజాం, మైసూరు పాలకు దారుణాలకు వ్యతిరేకంగా బంజారాల హక్కుల కోసం సంత్ సేవాలాల్ వీరోచితంగా పోరాడారు. ఆంగ్లేయులు, ముస్లిం పాలకుల ప్రలోభాలు, ఇన్‌ఫ్లుయెన్స్‌లకు లొంగకుండా బంజారాలు మతం మారకుండా ఎంతో కృషి చేశారని చెబుతారు. లిపి లేని బంజారాల భాషకు ఒక రీతిని తీసుకువచ్చింది కూడా సేవాలాలే అని పేర్కొంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios