Wedding: గల్ఫ్‌లో జరిగిన పెళ్లి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఒక్క చోటికి తెచ్చింది! ఇంతకీ వారెవరు?

బహ్రెయిన్‌లో జరిగిన వివాహ వేడుక.. తెలంగాణ రాష్ట్ర అధికార, ప్రతిపక్షాలను ఒక్క చోటికి తెచ్చే వేదికగా మారింది. 
 

wedding of bride and grooms belongs to congress and brs party leaders family in bahrain kms

Bahrain: పెళ్లి వేడుక అంటే కుటుంబం అంతా సందడిగా ఉంటుంది. బంధు మిత్రులతో వేడుక హడావిడిగా ఉంటుంది. ఎందరో మిత్రులను, దూరపు బంధువులను ఏకం చేసే వేదికగా వివాహాలు మారుతుంటాయి. కానీ, బుధవారం బహ్రెయిన్‌లో జరిగిన ఓ పెళ్లి ఏకంగా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలను కూడా ఒకే వేదిక మీదికి తెచ్చింది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది?

కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో సంబంధాలున్న కుటుంబాల మధ్య ఈ వేడుక జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కుమారుడు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పీ వెంకట రామిరెడ్డి సోదరుడు పీ మహిందర్ రెడ్డి కూతురు పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుక గల్ఫ్ కంట్రీ బహ్రెయిన్‌లో జరిగింది. పెళ్లి కొడుకు లోహిత్ పెండ్లి కొడుకు బృందం ఈ రోజే బారాత్‌తో బహ్రెయిన్‌కు వెళ్లింది. పెళ్లి జరిగింది.

Also Read: Raebareli: గాంధీ కుటుంబం యూపీని వదిలేసినట్టేనా? కాంగ్రెస్ కంచుకోటల నుంచి బయటికి..!

ఈ పరిణయ వేడుకకు మంత్రి వెంకట్ రెడ్డి కూడా హాజరయ్యారు. చాలా మంది ఆహ్వానితులు ఈ రోజే చార్టర్డ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు.

ఎమ్మెల్సీ వెంటకరామిరెడ్డి కుటుంబం రియల్ ఎస్టేట్ సంస్థ రాజా పుష్ప. శ్రీనివాస రెడ్డి కుటుంబానికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కలిగి ఉండటంతోపాటు పలు సంస్థలతో సంబంధాలు ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios