తమిళిసై ట్విట్టర్ ఖాతా హ్యాక్: సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు


తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఖాతా ఎక్స్   (ట్విట్టర్) ఖాతా  హ్యాక్ అయింది.ఈ విషయమై  పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు.

Telangana Governor Tamilisai Twitter Account Hacked lns

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై  సౌందరరాజన్ ఎక్స్ (  ట్విట్టర్)  అకౌంట్  హ్యాక్ అయినట్టుగా రాజ్ భవన్ అధికారులు గుర్తించారు.ఈ విషయమై  హైద్రాబాద్  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత కొంత కాలంగా తమిళిసై సౌందర రాజన్  సోషల్ మీడియా ఖాతా  ఎక్స్ లో  తమకు తెలియకుండానే  పోస్టులు రావడంపై రాజ్ భవన్ వర్గాలు  ఆరా తీశాయి.  ఈ విషయమై  సైబర్ క్రైమ్ పోలీసులకు  రాజ్ భవన్ వర్గాలు  ఫిర్యాదు చేశాయి.  

ఎక్స్ ఖాతాను  ఓపెన్ చేసిన సమయంలో  తప్పుడు పాస్ వర్డ్ అంటూ  సూచించేది.  మరో వైపు ఈ ఖాతాలో తాము పోస్టు చేయని అంశాలను కూడ  గుర్తించారు సిబ్బంది. దీంతో  ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైందని  గుర్తించారు. ఈ విషయమై  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్ భవన్ సిబ్బంది.   రాజ్ భవన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

also read:విమానం టాయిలెట్‌లోనే 100 నిమిషాలు ప్రయాణీకుడు: ఎందుకో తెలుసా?

గతంలో కూడ  పలువురు అధికారులు,రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కు గురయ్యాయి.  ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య  శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ హ్యాక్ కు గురైంది. గతంలో  ఆర్టీసీ ఎండీ వీ.సీ. సజ్జనార్  సోషల్ మీడియా ఖాతా కూడ హ్యాక్ కు గురైంది.  మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ఖాతా కూడ  హ్యాక్  కు గురైన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios