పేపర్ లీక్ ఘటన.. తమిళిసై ఆరా, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ టీఎస్‌పీఎస్సీకి ఆదేశం

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ వ్యవహారంపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని గవర్నర్ ఆదేశించారు. అసలైన అభ్యర్ధుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. 
 

telangana governor tamilisai soundararajan reacts on tspsc paper leak

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు.  ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి రాజ్‌భవన్ నుంచి లేఖ వెళ్లింది. 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ కార్యాలయం ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అసలైన అభ్యర్ధుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. 

అటు పేపర్ లీక్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణను సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ జరగనుంది. మరోవైపు.. పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడు ప్రవీణ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు పోలీసులు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చే చాలామందితో ప్రవీణ్ సంబంధాలు పెట్టుకున్నాడు. అతని సెల్‌లో పలువురు మహిళల కాంటాక్ట్స్ వున్నట్లుగా పోలీసులు తెలిపారు. కాన్ఫిడెన్షియల్ గదికి సెక్రటరీ వెళ్లినప్పుడు.. ఐపీ, యూజర్ ఐడీ దొంగిలించాడు ప్రవీణ్. అనంతరం ఏఈ ప్రశ్నాప్రత్రాన్ని రాజశేఖర్‌తో కలిసి పెన్‌డ్రైవ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. దీని గురించి రేణుక దంపతులతో చర్చించిన ప్రవీణ్ ఒక్కో అభ్యర్ధి నుంచి రూ.20 లక్షల వసూలు చేయాలని.. అందులో రూ.10 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

ALso REad : ఏఈ పరీక్షపై రేపు నిర్ణయం.. నా పిల్లలెవ్వరూ ఎగ్జామ్ రాయలేదు: పేపర్ లీక్‌పై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్

అనంతరం ప్రశ్నాపత్రాన్ని ప్రింట్ తీసి రేణుక దంపతులకు ఇచ్చాడు. దీంతో వారు వాళ్ల కమ్యూనిటీలో పేపర్ వుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్ధులు నీలేష్,గోపాల్‌లు ప్రశ్నాపత్రం కొనేందుకు ముందుకు వచ్చారు. పరీక్షకు మూడు రోజుల ముందు వీరిద్దరిని తన ఇంట్లోనే వుంచి ప్రిపేర్ చేయించారు. అలాగే పరీక్షా పత్రం లీకేజ్ గురించి బయటకు తెలియకుండా రేణుక దంపతులు జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్ష రోజున వనపర్తి నుంచి అభ్యర్ధులను కారులో సరూర్ నగర్‌లోని సెంటర్‌లో వదిలిపెట్టారు రేణుక దంపతులు. పోలీసులు విచారణలో నిందితులంతా తమ నేరాన్ని అంగీకరించారు. మరోవైపు.. పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించిన నిందితులకు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. 8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, ఏ3 నిందితురాలు రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios