కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తమిళిసై భేటీ:తెలంగాణలో పరిస్థితులపై నివేదిక

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర మంత్రికి వివరించారు.

Telangana Governor Tamilisai Soundararajan Meets union Minister Amit Shah

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై బుధవారం నాడు రాత్రి భేటీ అయ్యారు.  రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై తమిళిసై సౌందర రాజన్ కేంంద్ర మంత్రి అమిత్ షాకు వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో  చోటు చేసుకుున్న పరిణామాలపై కేంద్ర మంత్రికి తమిళిసై నివేదిక కూడా ఇచ్చారని సమాచారం.

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్  ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర శిబిరం వద్ద బస చేసిన చోటే దీక్షకు ప్రయత్నిస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ నుండి కరీంనగర్ జిల్లాలోని తన ఇంటి వద్ద  బండి సంజయ్ ను పోలీసులు వదిలివెళ్లారు.  బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని కూడా వర్ధన్నపేట పోలీసులు  బండి సంజయ్ కు నోటీసులు అందించారు. ఈ విషయమై గవర్నర్ తమిళిసైతో బీజేపీ నేతలు నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. పాదయాత్ర నుండి బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.  ఇవాళ ఉదయమే తమిళిసై న్యూఢిల్లీకి వెళ్లారు.  ఇవాళ  రాత్రి ఆమె అమిత్ షా తో భేటీ అయ్యారు. మరో వైపు వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో హైద్రాబాద్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొంది. 

శాంతి భద్రతలను నెలకొల్పేందుకు  పోలీసు యంత్రాంగం ఎలా పనిచేస్తుందనే విషయమై కూడా అమిత్ షా ఆరా తీసినట్టుగా సమాచారం.  రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందా అనే విసయాలపై కూడా కేంద్ర మంత్రి ఆరా తీసినట్టుగా మీడియా రిపోర్టు చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios