తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఓ పేద విద్యార్థికి చేయూతనిచ్చి చదువుకు సాయం చేశారు. అతడి ఆర్థిక పరిస్థితికి చలించిన ఆమె కడుపునిండా భోజనం పెట్టించి, ఓ ల్యాప్ టాప్ అందజేశారు. 

వివరాల్లోకి వెడితే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బియ్యని ప్రమోద్ మెయినాబాద్ సమీపంలోని జోగినపల్లి బీఆర్ ఫార్మసీ కాలేజీలో ఫార్మ్ డి థార్డ్ ఇయర్ చదువుతున్నాడు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ‘మై గవర్నమెంట్ యాప్’లో క్విజ్ పోటీల్లో పాల్గొంటుంటాడు. అతడికి ల్యాప్ టాప్ కొనే ఆర్థిక స్థోమత లేకపోవడంతో తన సమస్యను వివరిస్తూ రాజ్‌భవన్‌కు మెయిల్‌ చేశాడు.

ఈ మెయిల్ కు ఆదివారం స్పందన వచ్చింది. గవర్నర్ కార్యాలయం నుంచి అతడికి పిలుపు వచ్చింది. సోమవారం రాజ్ భవన్ కు వెళ్లాడు. అతనితో కాసేపు ముచ్చటించిన గవర్నర్ అతని పరిస్తితికి చలించిపోయారు. కడుపునిండా భోజనం పెట్టించారు. ఆ తరువాత ల్యాప్ టాప్ అందించి బాగా చదువుకోవాలని తెలిపారు.