Asianet News TeluguAsianet News Telugu

మరో రోజు సమావేశం పెట్టండి: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

 కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలను వాయిదా వేయాలని బోర్డులకు తెలంగాణ  ప్రభుత్వం ఆదివారం నాడు లేఖ రాసింది.  మరో రోజున ఈ సమావేశాలను నిర్వహించాలని  ఆ లేఖలో తెలంగాణ ఇరిగేషన్ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ కోరారు.
 

Telangana Government writes letter to KRMB, GRMB
Author
Hyderabad, First Published Aug 8, 2021, 4:39 PM IST

హైదరాబాద్: ఈ నెల 9వ తేదీన నిర్వహించతలపెట్టిన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలను వాయిదా వేయాలని  తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఛైర్మెన్లకు లేఖలు రాశారు.ఈ నెల 9వ తేదీన కేఆర్ఎంబీ,జీఆర్ఎంబీ  సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలను  వాయిదా వేయాలని ఏపీ  ఈ రెండు బోర్డులకు తెలంగాణ నీటి పారుదల శాఖ లేఖలు రాసింది.

also read:ఈ నెల 9న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ భేటీ: తెలంగాణ అధికారులు హాజరయ్యేనా?

 ఈ సమావేశాలకు తమకు రావడం  కుదరదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మరో రోజున సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడ ఆ సమావేశంలో కోరారు. మరో వైపు  నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవసరాల రీత్యా పోతిరెడ్డిపాడు నుండి  ఏపీ ప్రభుత్వం నీటిని ఉపయోగించుకోకుండా  ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ  కేంద్రం ఇటీవల గెజిట్ జారీ చేసింది. ఈ గెజిట్ ను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గెజిట్‌లో అంశాలను టైమ్ షెడ్యూల్ ప్రకారంగా పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ నెల 9వ తేదీన ఈ రెండు బోర్డుల సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు ఏపీ హాజరుకానుంది. తెలంగాణ మాత్రం ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది.  గతంలో నిర్వహించిన సమావేశానికి కూడ తెలంగాణ డుమ్మా కొట్టింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios