ఈ నెల 9న కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ భేటీ: తెలంగాణ అధికారులు హాజరయ్యేనా?
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశాలు ఈ నెల 9వ తేదీన జరగనున్నాయి.ఈ సమావేశాలకు తెలంగాణ అధికారులు హాజరౌతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరుకాబోమని తెలంగాణ అధికారులు లేఖ రాశారు.
హైదరాబాద్: కేఆర్ఎంబీ (కృష్ణానదీ యాజమాన్య బోర్డు), జీఆర్ఎంబీ (గోదావరి యాజమాన్య బోర్డు)ల పూర్తిస్థాయి సమావేశం ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నారు. అయితేఈ సమావేశాలకు తెలంగాణ అధికారులు హాజరౌతారా కారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కోర్టు కేసుల కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేమని మరో రోజున సమావేశాన్ని ఏర్పాటుచేయాలని జీఆర్ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.
also read:రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం... బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణి గట్టిగా వినిపించాలి: అధికారులతో కేసీఆర్
ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ లోని అంశాలను నిర్ణీత గడువులోపుగా పూర్తి చేయాలని కేంద్రజల్ శక్తి కార్యదర్శి ఈ రెండు బోర్డులను ఆదేశించారు.జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ బోర్డుల సమావేశాలను ఈ నెల 9వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ రెండు బోర్డు మీటింగుల్లో తమ అభిప్రాయాలు చెప్పాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.ఆదివారంనాడు సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయించడమో లేదా కేంద్రానికి లేఖ రాయాలని కూడ ఇరిగేషన్ అధికారుల సమావేశంలో ఓ ప్రతిపాదన వచ్చింది.