తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కొరకు  ప్రభుత్వం  నోటిఫికేషన్ జారీ చేసింది.  ఈ ఏడాది ఆగస్టు మాసంలో  ఎంబీఏ, ఎంసీఏ  ప్రవేశాల కొరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను  ప్రారంభించనుంది తెలంగాణ సర్కార్.

హైదరాబాద్: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కొరకు ఈ ఏడాది ఆగష్టు 14 నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న స్పాట్ ఆడ్మిషన్ల కోసం మార్గదర్శకాలను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

ఈ ఏడాది ఆగస్టు ఆగష్టు 14 నుండి 18 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆగష్టు 16 నుండి 19 వరకు సర్టిఫికెట్లను పరిశీస్తారు.
ఆగష్టు 16 నుండి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోనే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. 

ఈ ఏడాది ఆగస్టు 25న ఎంబీఏ, ఎంసీఏ తొలివిడత సీట్ల కేటాయిస్తారు. సెప్టెంబర్ 1 నుండి తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 1 నుండి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న తుది విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయించనున్నారు. ఈ ఏడాది 
సెప్టెంబర్ 8న స్పాట్ ఆడ్మిషన్ల మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నారు.