Asianet News TeluguAsianet News Telugu

61 ఆసుపత్రుల్లో చికిత్సలు, 20 రోజుల్లో రెట్టింపు కరోనా పరీక్షలు: హైకోర్టుకు తెలంగాణ సర్కార్

రాష్ట్రంలో గత 20 రోజుల్లో రెట్టింపు కరోనా పరీక్షలు నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.రాష్ట్రంలో కరోనా కట్టడికి తాము కట్టుబడి ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది

Telangana government submits report to high court
Author
Hyderabad, First Published Jul 22, 2020, 6:16 PM IST


హైదరాబాద్: రాష్ట్రంలో గత 20 రోజుల్లో రెట్టింపు కరోనా పరీక్షలు నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.రాష్ట్రంలో కరోనా కట్టడికి తాము కట్టుబడి ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు 2.08 లక్షల శాంపిళ్లను పరీక్షించగా వాటిలో 39,342 కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వం తెలిపింది.

కరోనా సోకిన వారిలో 66 శాతం మంది కోలుకొన్నారని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. గతంలో 10 లక్షల మందిలోనూ 2,515 మందికి పరీక్షలు చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రస్తుతం5,961 మందికి పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

also read:సహనాన్ని పరీక్షించొద్దు, ఇదే చివరి అవకాశం: వైద్య శాఖపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీ పరిధిలోని 300 హెల్త్ సెంటర్లు, జిల్లాల్లోని 870 పీహెచ్‌సీల్లో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు పరీక్షల నిర్వహణకు అందుబాటులోకి రావడం వల్ల మొబైల్ ల్యాబ్ లు అవసరం రాదని ప్రభుత్వం తెలిపింది.

13 ప్రభుత్వ, 23 ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలు జరుగుతున్నాయని ప్రభుత్వం వివరించింది. కరోనా టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు రెండు రోజుల క్రితం ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. 

కరోనా చికిత్సల నిమిత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 9, జిల్లాల్లో 52 ఆసుపత్రులను గుర్తించినట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.గాంధీ ఆసుపత్రి సామర్ధ్యాన్ని పెంచినట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇక్కడ 1012 నుండి 1890కు పెంచినట్టుగా ప్రభుత్వం వివరించింది.

డాక్టర్్లు, నర్సులు, పోలీసులకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా రక్షణ పరికరాలను అందించినట్టుగా తెలంగాణ సర్కార్ హైకోర్టు తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా 17,081 బెడ్స్ అందుబాటులో ఉండగా ఇంకా 90.5 శాతం ఖాళీగానే ఉన్నాయని వివరించింది. ఈ నెల 15వ తేదీ వరకు జీహెచ్ఎంసీ పరిధిలో  61, ఇతర ప్రాంతాల్లో 349 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని  ప్రభుత్వం ప్రకటించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios