హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ వీఆర్ఎస్ కు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది.

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనే ఆయన  వీఆర్ఎస్ కోసం ధరఖాస్తు చేసుకొన్నారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీన ఆయన రిటైర్మెంట్ కోసం ధరఖాస్తు చేసుకొన్నారు.

వాలంటరీ రిటైర్మె్ంట్ కోసం ఆయన ధరఖాస్తు చేసుకొన్న  కొద్దిరోజులకే ఆయనను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. స్టేట్ పోలీస్ అకాడమీ నుండి ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది  ప్రభుత్వం.

వీఆర్ఎస్ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ అభ్యర్ధనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది.వీకే సింగ్  వీఆర్ఎస్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ నెల 2వ తేదీన ఆయనకు ప్రభుత్వం నోటీసు పంపింది. వీకే సింగ్ పనిచేసిన రెండు శాఖల్లో విచారణ పెండింగ్ లో ఉన్నందున వీఆర్ఎస్ కు బ్రేక్ వేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్టుగా సమాచారం.

వీకే సింగ్ జైళ్ల శాఖలో పనిచేసిన సమయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. మరో వైపు పోలీస్ అకాడమీలో పనిచేసే సమయంలో ఆయన చేసిన విమర్శలు కూడ కలకలం రేపాయి.