తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20 తరువాత లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ తరహా అన్ లాక్ కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. 

కరోనా వైరస్ దేశాన్నే కాదు.. రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేసింది. కరోనా కట్టడి కాకపోవడంతో పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేశాయి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 19తో లాక్ డౌన్ ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటలవరకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ నెల 19 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20 తరువాత లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ తరహా అన్ లాక్ కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణలో కరోనా పాజిటివిటి 1.36 శాతానికి తగ్గిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అన్ లాక్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. 

రాష్ట్రంలో ఈ నెల 19 తర్వాత నైట్ కర్ఫ్యూ కొనసాగించే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జూలై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయం మీద క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాలి.