హైదరాబాద్: ఉచిత కరోనా నిర్ధారణ పరీక్షలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ నుండి కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం నిలిపివేసింది. రెండు రోజుల పాటు కొత్తగా శాంపిల్స్ సేకరించబోమని ప్రభుత్వం ప్రకటించింది.

జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీ నుండి జీహెచ్ఎంసీ పరిధిలోని పలు సెంటర్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తొమ్మిది రోజుల్లో 36 వేల మంది నుండి  శాంపిల్స్ సేకరించారు. దీంతో ప్రభుత్వ ల్యాబ్స్ రోజంతా పనిచేసినా కూడ సేకరించిన శాంపిల్స్ ను ఫలితాలు తేల్చలేని పరిస్థితి ఉంది.

దీంతో శాంపిల్స్ సేకరణను నిలిపివేసింది వైద్య ఆరోగ్యశాఖ. సేకరించిన శాంపిల్స్ ను పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ఈ  జూన్ 30వ తేదీ నుండి ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రారంభించింది వైద్య ఆరోగ్య శాఖ.

ఒక్కసారి సేకరించిన శాంపిల్స్ ను 48 గంటల్లోపుగా పరీక్షలు ప్రారంభించకపోతే ఆ శాంపిల్స్ కు ఉపయోగం ఉండదు. 48 గంటల తర్వాత శాంపిల్స్ పరీక్షిస్తే నెగిటివ్ గా వస్తోందని నిపుణులు చెబుతున్నారు.దీంతో సేకరించిన శాంపిల్స్ ను  రిజల్ట్స్ వచ్చిన తర్వాతే కొత్తగా శాంపిల్స్ సేకరణను ప్రారంభించారు.

also read:24 గంటల్లో 418 మంది మృతి: ఇండియాలో 5,66,840కి చేరిన కరోనా కేసులు

సరోజిని దేవి కంటి ఆసుపత్రి, నేచర్ క్యూర్ ఆసుపత్రి, ఆయుర్వేదిక్ ఆసుపత్రి, చార్మినార్ తదితర ఆసుపత్రుల్లో ఇవాళ్టి నుండి కరోనా నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరిస్తున్నారు. 

ఒక్కో పరీక్షా కేంద్రంలో రోజుకు 250 మంది నుండి శాంపిల్స్ సేకరించనున్నారు.  కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, బాలాపూర్, మహేశ్వరం, యూపీహెచ్‌సీలలో రోజుకు 150 శాంపిల్స్ చొప్పున సేకరించాలని నిర్ణయం తీసుకొన్నారు.

రాష్ట్రంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధిక భాగం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. దీంతో అవసరమైతే మరోసారి లాక్ డౌన్ విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రెండు మూడు రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి లాక్ డౌన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదు.