హైదరాబాద్:  సెప్టెంబర్ 1వ తేదీ నుండి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆన్ లైన్ లో విద్యార్థులకు క్లాసులను బోధించాలని ప్రభుత్వం తలపెట్టింది.

ఈ నెల 27వ తేదీ నుండి ఉపాధ్యాయులు విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్ లైన్ క్లాసులను విద్యార్థులకు క్లాసులు బోధించాలని ప్రభుత్వం తలపెట్టింది.

వాస్తవానికి ఈ నెల 20 వ తేదీ నుండి ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఆన్ లైన్ క్లాసులను నిర్వహించాలని తలపెట్టింది.

also read:ఎన్‌సీఈఆర్‌టీ సర్వేలో షాకింగ్ విషయాలు: ఆన్‌లైన్ విద్యపై విద్యార్థుల అసంతృప్తి

ప్రతి రోజూ 50 శాతం ఉపాధ్యాయులు మాత్రమే హాజరయ్యేలా ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కూడ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఆగష్టు 31వ తేదీ తర్వాత ఆన్ లాక్ 3 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయనుంది.ఈ మార్గదర్శకాల్లో విద్యాసంస్థలకు మినహాయింపు ఉండే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు నెలకొన్నాయి.

ఇక ఏపీ రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.