హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుండి పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

6వ, తరగతి నుండి10వ తరగతి వరకు విద్యార్థులకు దూరదర్శన్, టీ శాట్ ద్వారా పాటాలను బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి మూడో తరగతి నుండి ఐదో తరగతి విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా బోధించనున్నారు. 

also read:సెప్టెంబర్‌లో తెలంగాణలో ఎంసెట్: హైకోర్టు అనుమతి కోరనున్న ప్రభుత్వం

సెప్టెంబర్ 17  నుండి పాఠశాలలకు 50 శాతం ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యా శాఖ ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లకు నిబంధనలు, టైమ్ లిమిట్ ను పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం తయారు చేస్తోంది. 

సెప్టెంబర్ 1వ తేదీ నుండి తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ఆడ్మిషన్లు ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించనున్నారు.

ఈ నెల 20వ తేదీ నుండి దోస్త్ డిగ్రీ ఆడ్మిషన్లు  నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.