హైదరాబాద్: ఈ ఏడాది సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు అనుమతి ఈ తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది.

ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2 న పాలీసెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో పిల్ ఉంది. ఈ పిల్ పై విచారణ సాగుతోంది. 

ఈ నెలాఖరు నుండి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టుగా రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఉన్నత విద్యామండలి హైకోర్టుకు నివేదించనుంది. హైకోర్టు ప్రవేశ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పరీక్షలు నిర్వహించనుంది.కరోనా నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం  ఈ ఏడాది జూన్ 30వ తేదీన ప్రకటించింది. తెలంగాణలో జూలై మాసంలో పలు కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇదివరకే షెడ్యూల్ ను విడుదల చేసింది. 

జూలై 1వ తేదీన పాలిసెట్, జూలై 1 నుండి 3 వరకు పీజీఈసెట్, జూలై 4న ఈసెట్, జూలై 6 నుండి 9వరకు ఎంసెట్, జూలై 10న లాసెట్, లా పీజీసెట్, జూలై 13న ఐసెట్, జూలై 15న ఎడ్ సెట్ నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 

రాష్ట్రంలోని కామన్ ఎంట్రన్స్ టెస్టులను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.ఈ పిల్ పై  హైకోర్టు విచారణ చేసింది. లాక్ డౌన్ విధిస్తే కామన్ ఎంట్రన్స్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 

దీంతో రాష్ట్రంలో కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం జూన్ 30వ తేదీన హైకోర్టుకు తెలిపింది.పాలీసెట్ కు 20 వేలు, జూలై 4 జరగాల్సిన ఈసెట్ కు 28వేలు,జూలై 15న నిర్వహించే ఎడ్ సెట్ కు 44వేలు,జూలై 10న లాసెట్ కు 29వేల ధరఖాస్తులు వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. వాయిదా వేసిన ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మాసంలో నిర్వహించే అవకాశం ఉంది.అయితే ఈ తేదీలను కోర్టు అనుమతి పొందిన తర్వాత ప్రభుత్వం ప్రకటించనుంది