విద్య, ఉద్యోగాల్లో ఆర్ధికంగా వెనుకబడినవారికి 10 శాతం  రిజర్వేషన్లను అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్.

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది జనవరి 21వ తేదీన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

also read:ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు: కేసీఆర్ నిర్ణయం

ఇప్పటికే తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకొంటాయి.రాష్ట్రంలో తెలంగాణలో బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 20 నుండి 22 శాతం జనాభా అగ్రవర్ణాలకు చెందినవారు ఉంటారు. 

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్య,ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లను ఆర్ధికంగా వెనుకబడినవారికి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.