హైదరాబాద్:

:తెలంగాణలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.

గురువారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఆర్దికంగా వెనుబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకొంటాయి.

 

రాష్ట్రంలో తెలంగాణలో బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి.  రాష్ట్రంలో సుమారు 20 నుండి 22 శాతం జనాభా అగ్రవర్ణాలకు చెందినవారు ఉంటారు.ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్య అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఆర్ధికంగా వెనుకబడినవారికి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.ఈ నెలాఖరువరకు ప్రభుత్వానికి అగ్రవర్ణాలు డెడ్ లైన్ విధించాయి.

రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్ లకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా ఇతర రిజర్వేషన్లకు ఆటంకం కాదని అగ్రవర్ణ సంఘాలు అభిప్రాయపడ్డాయి.రెడ్డి, బ్రహ్మణ, వెలమ, వైశ్య, కమ్మ వేల్పేర్ అసోసియేషన్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 శాతం రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేశాయి