తెలంగాణ ఆవిర్భావ వేడుకల నుండి ఉద్యోగ ప్రకటనల వేగాన్ని పెంచిన కేసీఆర్ సర్కార్ ఆ వేగాన్నే కొనసాగిస్తుంది. పోలీస్, రెవెన్యూ వంటి పలు కీలక శాఖల్లో ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తూ నిరుద్యోగ యువత ప్రభుత్వోద్యోగ కలను సాకారం చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా విద్యాశాఖలో మరో 400 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుతినిచ్చింది. 

తెలంగాణ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలలకు కలిపి 400 టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 175 జూనియర్ లెక్చరర్స్, 100 టీజీటీ, 50 పీజీటీ, 50 లైబ్రేరియన్స్, 25 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులున్నాయి. వీటిని భర్తీ చేసే బాధ్యతను ప్రభుత్వం గురుకుల నియామక బోర్డు కు అప్పగించింది.