హైదరాబాద్: హలియాలో సీఎం కేసీఆర్ ఎన్నికల సభను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన హలియాలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ ను  నిర్వహించాలని నిర్ణయం తీసుకొంది.ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 13, 14 తేదీల్లో హైకోర్టుకు సెలవులున్నాయి. ఈ నెల 14వ తేదీన హలియాలో సీఎం కేసీఆర్ ఎన్నికల సభు నిర్వహించనున్నారు.

Also read:ఈ నెల 14న హలియాలో కేసీఆర్ సభ: హైకోర్టులో రైతుల పిటిషన్

 

ఈ నెల 15వ తేదీతో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచారానికి తెరపడనుంది.  ప్రచారానికి తెరపడడానికి ఒక్క రోజు ముందే కేసీఆర్ హలియాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. తమ అనుమతి లేకుండానే తమ భూముల్లో సభను నిర్వహిస్తున్నారని కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. మరికొందరు కోవిడ్ సమయంలో లక్ష మందితో సభ నిర్వహణ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణకు తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు నిరాకరించింది.