హైదరాబాద్: కరోనా ప్రభావం గణేష్ ఉత్సవాలపై పడింది. గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు తేల్చి చెప్పింది.

ఈ నెల 22వ తేదీన వినాయక చవితి. తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి నిర్వహణ గతంలో నిర్వహించినట్టుగా నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

వినాయక చవితిని పురస్కరించుకొని ప్రతి వీధిలో కనీసం నాలుగైదు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు. హైద్రాబాద్ లో ఇక చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాల కోసం మండపాలను ఏర్పాటు చేస్తారు.

also read:కరోనా ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో 3 అడుగులకే గణేష్ విగ్రహలు

11 రోజులకు ట్యాంక్ బండ్ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో సామూహిక వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.అయితే కరోనా నేపథ్యంలో సామూహికంగా వినాయక విగ్రహల నిమజ్జనం ఈ ఏడాది లేదు.

మరోవైపు  గణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరో వైపు ఇళ్లలోనే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కూడ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఎత్తును ఈ ఏడాది 9 అడుగులకే పరిమితం చేశారు. ఈ దఫా మట్టి విగ్రహాన్ని మాత్రమే తయారు చేయనున్నారు. ఈ విగ్రహ తయారీ పనులు ప్రారంభమయ్యాయి.