కరోనా ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో 3 అడుగులకే గణేష్ విగ్రహలు
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని 9 అడుగులకే కుదించింది ఉత్సవ కమిటి.
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని 9 అడుగులకే కుదించింది ఉత్సవ కమిటి.
మంగళ్ ఘాట్, దూల్ పేటలలో వినాయక విగ్రహలు తయారు చేసే తయారీదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు మించి విగ్రహాలు తయారు చేయవద్దని ఈ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు మతపరమైన కార్యక్రమాలు, ఇతర పెద్ద సమ్మెళనాలకు సంబంధించి హోం మంత్రిత్వశాఖ ఉత్తర్వులను సమర్ధించేందుకు వీలుగా మూడు అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో తయారు చేయవద్దని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు.
also read:కరోనా ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో సామూహిక గణేష్ విగ్రహల నిమజ్జనానికి బ్రేక్
మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో గణేష్ విగ్రహాలను మండపాల్లో ప్రదర్శించి... ఊరేగిస్తే కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం ఉందని మంగళ్ హాట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి. రణవీర్ రెడ్డి చెప్పారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గణేష్ విగ్రహల విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయని విగ్రహ తయారీదారులు ప్రకటించారు. పోలీసుల ఆదేశాలతో ఆరు అడుగుల విగ్రహలు విక్రయాలు జరగవని విగ్రహ తయారీదారులు చెబుతున్నారు.గణేష్ ఉత్సవాలను కరోనా నిబంధనల మేరకు జరుపుకోవాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది.